పిఠాపురం : నేడు చిత్రాడ వద్ద జరిగే జనసేనపార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం మరియు విజయోత్సవ సభకు సుదూరప్రాంతాల (ఇతర ప్రాంతాల) నుండి వచ్చే వారికి స్థానిక పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరదేవస్థానం దర్శనం చేసుకొనే జనసేన నాయకులు, జనసైనికులకు, వీర మహిళలకు సుమారు 5000 మందికి జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవానికి 5 లక్షల మంది పైగా హజరుకావడం జరుగుతుందని, అందులో భాగంగానే 2 రాష్ట్రాల నుండి వచ్చే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు దేశంలోనే ప్రసిద్ధమైన పిఠాపురం పాదగయ క్షేత్రంలో గల దేవాలయాలను సందర్శించుకున్న అనంతరం శుక్రవారం మధ్యాహ్నం వచ్చేవారి కోసం ఈ భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పైన గల అభిమానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జ్యోతుల శ్రీనివాస్ తెలియజేశారు.