Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేక కథనం

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

పిఠాపురం, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న 12 జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, సినీ మరియు టీవీ నటి రాగిణి, తొలి టెలివిజన్ వ్యాఖ్యాత విజయ దుర్గ తదితరులు పిఠాపురం పట్టణానికి చెందిన జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, సినీ రచయిత, దర్శకుడు, పత్రికా సంపాదకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను యమునా నది పుష్కర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ నదీ జలాల పరిరక్షణ కోసం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మరియు సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పుష్కరాలు జరుపుకోబోతున్న పవిత్ర యమునా నదీ పేరిట పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు డా సునీల్ కుమార్ యాండ్ర కు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

భాజపా బూత్ స్థాయి నాయకులకు చెక్కులు అందజేత

TNR NEWS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం   – ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ – ఎం ఎస్ పి రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ 

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

TNR NEWS