కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత
చేర్యాల టౌన్:-
శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి విరాళంగా రెండు కిలోల వెండి బిందె 400 గ్రాముల హారతి ప్లేటు విరాళంగా బైకర్ శంకరిబాయి శివకుమార్ దంపతులు సకుటుంబంగా దర్శనానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ కు వెండి బిందె మరియు ఏక హారతి అప్పగించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ వారికి మల్లికార్జున స్వామి వారి శేష వస్త్రములు మరియు ప్రసాదాన్ని అందజేశారు.అర్చకులు బసవేశ్వర్ ఆలయ గుమస్తా సిద్దయ్య తదితరులు ఉన్నారు.