జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని నాగల్గాం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసి, పదోన్నతి, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల కు గ్రామస్తులు పక్షాన ఘనంగాసన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ పదోన్నతులు పొంది బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించి వీడ్కోలు పలికారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ తిరుపతయ్య ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన వారికి బదిలీపై వెళుతున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీ సహజమని బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాఠశాలకు ఎనలేని సేవలు చేశారు అన్నారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ అనిల్ కుమార్ గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.