Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

 

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య ఒక్కటే సరైన పునాది అని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ బడా సాహెబ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారి నజియా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్య అభివృద్ధి కోసం మౌలానా అబ్దుల్ కలాం ఎనలేని కృషి చేశారని ఆయనకు గుర్తుగా ఆయన జయంతి జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు నుండే కష్టపడాలని చెప్పిన మహోన్నత వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం అని గుర్తు చేశారు. విద్యార్థులు చెడు అలవాటులకు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు సెల్ఫోన్లను టీవీలను దూరంగా పెట్టి చదువు దగ్గర చేసుకోవాలని జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అనంతరం జాతీయ విద్యా దినోత్సవ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరాణి, తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ సెక్రటరీ షేక్ జాఫర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె కాజా మొయినుద్దీన్, కోశాధికారి జానీ పాషా, బషీరాఉన్నిసా బేగం పాల్గొన్నారు.

Related posts

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

తల పిరికెడు బియ్యం తో వృద్ధుల ఆకలి తీర్చిన విద్యార్థులు  వృద్ధులకు చేయూతను అందించిన విద్యార్థులు

TNR NEWS

భారత పర్యటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలి

Harish Hs

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది

Harish Hs

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

TNR NEWS

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS