సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఐఓసీ ఆఫీస్ పక్కన గ్రౌండ్ మైదానంలో ఫిష్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ గ్రామస్తుడు ఎర్రబోయిన నాగరాజు సోమవారం తన ఫిష్ ఫుడ్ కోర్ట్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రజలకు, యువతకు ఉపాధి లేక జీవనోపాధి లేక అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది ప్రజలు వారికి వచ్చిన చిన్న చిన్న పనిని చేసుకుంటూ తల్లిదండ్రులను పిల్లలను పోషించుకుంటూ బతుకు దేరువు సాగిస్తున్నారు. యువత డబ్బులను వృధా చేయకుండా వారికి నచ్చిన సొంత వ్యాపారంలో రాణించి ప్రజల మెప్పు పొందుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ కోర్ట్ బందు మిత్రులతో కలిసి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని యజమాని ఎర్రబోయిన నాగరాజు అన్నారు. యువత స్వంత వ్యాపారాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తోటి స్నేహితులు బంధువులు తెలిపారు. వినియోగ దారుల మన్నన పొందే విధంగా ముందుకు సాగాలని మిత్రులు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ శరీఫా ఉమర్, మాజీ సర్పంచ్ నర్సింలు, తాజా ఉప సర్పంచ్ నాగరాజు, లైన్మెన్ కొమురయ్య, బిఆర్ఎస్ నాయకులు హైమద్, కొమ్ము నరేష్ యాదవ్, అల్లం మల్లేశం, నర్సింలు, బాబు, నర్సింలు, శేఖర్, చింటు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.