April 12, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు….. ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి వికారాబాద్ ఘటన పై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా రెవెన్యూ సిబ్బంది

 

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు రెవెన్యూ సిబ్బంది నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా *ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ* , వికారాబాద్ ఘటన చాలా దురదృష్టకరమని, అధికారులపై దాడులు చేయడం, ప్రజలకు రెవెన్యూ సిబ్బంది అనేక రకాలుగా అందించే సేవలను విస్మరిస్తూ, పూర్తి అవగాహన రాహిత్యంతో భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని అన్నారు.

దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని, అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. *ట్రెస్సా అసోసియేట్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ*, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే ఫార్మాసిటీ కోసం భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కోడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ సిబ్బంది పై గ్రామస్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటూ పని చేసే రెవెన్యూ సిబ్బందిపై దాడులు అవాంఛనీయమని అన్నారు.

జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడులు చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో భూసేకరణ కోసం వెళ్లే రెవెన్యూ సిబ్బందికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

అనంతరం ట్రెస్సా జిల్లా కమిటీ తరఫున రెవెన్యూ సిబ్బంది డిమాండ్లను వివరిస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ట్రెస్సా అధ్యక్షులు వకీల్, పెద్దపల్లి జనరల్ సెక్రెటరీ మహేష్,పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

TNR NEWS

TNR NEWS

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ 

TNR NEWS