చేర్యాల మండలంలోని విరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ మిల్లులో తూకంలో తేడాలను గమంచిన ముస్త్యాల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో మిల్లుదగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో చేర్యాల ఎస్ఐ నీరేశ్ వచ్చి రైతులను సముదాయించి ఆందోళనలు విరమింపచేయించారు.ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి పోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు,పత్తి కొనుగోలు అధికారి అమిత్ పాటిల్ తో మరికొంత మంది వచ్చి మిల్లును సందర్శించి తూకం వేసే కాంటను,యంత్రాలను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతోని మాట్లాడి జరిగింది తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో డిఎంఓ మాట్లాడుతూ సాంకేతిక కారణాలవల్ల తూకంలో తేడాలు వస్తున్నట్లు గుర్తించామని దీనిని సరిచేసివరకు కొనుగోళ్ళకు నిలుపుదల చేస్తున్నామని అన్నారు.