Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  • 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్ -3 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.విధులు నిర్వహించే అధికారులు ఉదయం 7:00 గం॥ లకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలలో 16,543 మంది అభ్యర్థులు హాజరు కారు ఉన్నారని తెలిపారు. ఫ్లైయింగ్ స్పాడ్ 19, జాయింట్ రూట్ ఆఫీసర్స్ 10, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 54, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ 208 , పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ నిబంధనలను పాటించాలని తెలిపారు. 17వ తేదీ ఉదయం మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకి అనుమతిస్తారని తెలిపారు. ఉదయం 9:30 మధ్యాహ్నం 2:30 గంటల సమయం దాటితే అభ్యర్థుల పరీక్ష కేంద్రానికి అనుమతించరని, గేట్లు మూసివేయాలని తెలిపారు. 18వ తేదీ పరీక్షకు 8:30 నుండి పరీక్షా కేంద్రాలకి అభ్యర్థులను అనుమతిస్తారని 9:30 గంటల తదుపరి గేట్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులకు బయటకు పంపొద్దు అని తెలిపారు అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలని సూచించారు పరీక్షా కేంద్రాల్లోని అభ్యర్థులను నిషిత పరిశీలన తదుపరి అనుమతించాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Related posts

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Dr Suneelkumar Yandra

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

Harish Hs

ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఎం ఎల్ ఏ పద్మావతి జన్మదిన వేడుకలు

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS