మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, అయోధ్యాపురం గ్రామానికి చెందిన, విశ్రాంత వైద్యులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం మొదట వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరు హోమియోపతి వైద్యులు అయినప్పటికీ, ఈ గిరిజన మేజర్ గూడూరు మండల కేంద్రంలో నిరుపేదల సౌకర్యార్థం, ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించి, నర్సంపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల నుండి ఎండి ఫిజీషియన్,ఎమ్మెస్ సర్జన్ డాక్టర్లను ఒప్పించి, గూడూరు మండల కేంద్రంలోని తను ప్రారంభించిన ఆస్పత్రికి రప్పించి, పలు విధాలైనరోగాల బారిన పడిన రోగులకు చికిత్సను, ఆపరేషన్లను ఎంబిబిఎస్ డాక్టర్లు సైతం చేయని సహాసాలను చేసి, ఎంత కష్టతరమైన ఆపరేషన్స్ అయినా మొక్కవోని ధైర్యంతో, ఇటు రోగుల కుటుంబీకులకు, అటు వైద్యం చేసే వైద్యులకు నేనున్నానంటూ ధైర్యం చెబుతూ, వైద్యం చేయించి, ఎంతో మంది నిరుపేద రోగాలకు, వారి కుటుంబీకులకులతో పాటుగా, పట్టణ ప్రాంతాల కెళ్ళి వైద్యం చేయించుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వారిని సైతం ఆకర్షించారు. మన గూడూరు మండల కేంద్రంలోని అన్ని రకాల వ్యాధులకు చికిత్సతో పాటుగా, ఆపరేషన్లు చేసే వెసులుబాటు ఉన్నందున, పట్టణాల హాస్పటల్ లకు వెళ్ళి వైద్యం చేయించుకునే ఇబ్బందులు పడే బాధలు తొలగిపోయినాయనే నమ్మకాన్ని, గూడూరు మండలంతో పాటుగా కేసముద్రం, నెక్కొండ, ఖానాపురం, కొత్తగూడ మండలాల ప్రజలకు సైతం భరోసా కల్పించినటువంటి, హోమియోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, నిరుపేదలు వైద్యం చేయించుకొని ఆపరేషన్ కు సరిపడా డబ్బులు ఇవ్వకపోయినా, సేవా దృక్పథంతో ఆప్యాయతతో ఆదరించి, అందరి మన్నలను పొందిన ఒక మంచి వైద్యుడు, నేడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ఆయన దాదాపు 20 సంవత్సరములు తను స్వయంగా సిరంజి పట్టి వైద్యం, ఆపరేషన్ చేసే అవకాశం లేకపోయినా, ఎమ్మెస్ సర్జన్, ఫిజీషియన్ ఎండిల అండదండలతో, ఎంతో ధైర్యంతో సేవ చేసిన ఇలాంటి వైద్యులు, నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో, చేతి వేళ్లపై లెక్క పెట్టే వారిలో మొదటి వరుసలో, స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ ఉంటారని, సంతాప సభలో పాల్గొన్న నర్సంపేట ఇండియన్ డాక్టర్ల బృందంవారి సేవలను కొనియాడారు. స్వర్గీయ భీమగాని లక్ష్మీనారాయణ వైద్య సేవలోనే కాకుండా, డాక్టర్ జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా స్వచ్ఛంద సేవా సంస్థలోను, హోమియో వైద్యుల యూనియన్ బాధ్యులుగాను, అందరికీ అందుబాటులో ఉండి, చురుకుగా పాల్గొని సేవలందించారు. అంతేకాకుండా వీరి కుటుంబంలో ఇద్దరు కుమారులు, కోడండ్లు, నలుగురు కూడా వైద్య సేవలోనే ఉండటం గమనార్వమని అన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, మన అందరినీ విడిచి వెళ్లి, స్వర్గస్తులు కావడం దురదృష్టకరమని, ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభలో పాల్గొన్న వైద్యులందరూ, వారి సేవలను ప్రశంసిస్తూ.. వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు.
previous post
next post