Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

 

తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఈ గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

1365 పోస్టుల కోసం ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం అలాగే సోమవారం…ఈ రెండు రోజుల్లో ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించబోతున్నారు.

 

ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు అధికారులు. 18వ తేదీ అంటే రేపు ఉదయం…ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడవ పేపర్ నిర్వహించబోతున్నారు. ఈ 1365 పోస్టులకు గాను 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నమాట. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి…అనుమతి ఇవ్వబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. ఒకే హాల్ టికెట్ 3 పేపర్లకు వర్తించనుంది.

Related posts

కోదాడలో టార్గెట్ లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం

Harish Hs

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

TNR NEWS

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

నిరుపేద వృద్ధులకు 50 దుప్పట్ల పంపిణీ*  *భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా* *వివేకానంద వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో*

TNR NEWS

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Harish Hs