మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డు శ్రీ సాయి నగర్ కాలనీలో గోపిరెడ్డి చంద్రశేఖర్, పత్తిపాక జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డితో కలిసి అందజేసి మాట్లాడారు. మన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని ప్రపంచ దేశాలు సైతం చాటి చెబుతున్నాయి అన్నారు. మన పూర్వీకుల నుండి వస్తున్న తెలుగు ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ సర్పంచులు పార సీతయ్య, ఎర్నేని బాబు, బాల్ రెడ్డి, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, షేక్ రహీం, అనురాధ తదితరులు పాల్గొన్నారు……….