సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నందు టార్గెట్ (ది పోలీస్ గేమ్) చిత్ర బృందం సభ్యులంతా కలిసి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని తెరా సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపకులు వేముల వెంకటేశ్వర్లు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దర్శకుడు తిరుప్ ఏర్పుల సమాజాన్ని చైతన్య పరిచే చిత్రాలు నిర్మించి అందరి మెప్పు పొందుతున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ గా శ్రీరంగం శ్రీనివాస్,సైమా, వేముల వెంకటేశ్వర్లు, చింతాబాబు మాదిగ, పంది తిరపయ్య,పులి నాగులు, మహమ్మద్ రఫీక్, దొంగరి వెంకటేశ్వర్లు, దేవరకొండ రమేష్, సంపేట వెంకట్, అంకతి రవి తదితరులు పాల్గొన్నారు.