Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

మండల పరిధిలోని ఊరెళ్ళ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కొందరు విద్యార్థులు వివిధ శాఖల అధికారులుగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రిగా ఆయేషా సిద్దిక, కలెక్టర్ గా మహమ్మద్ సిరాజ్ హుస్సేన్, జిల్లా విద్యాశాఖ అధికారిగా మహమ్మద్ సమీర్, ఉప విద్యాధికారిగా ఆయేషా ఫాతిమా, మండల పరిషత్ అధికారిగా సోఫియా, మండల విద్యాధికారిగా అర్బాన్, ప్రధానోపాధ్యాయులుగా చరణ్ తేజ వ్యవహరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

TNR NEWS

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ 

TNR NEWS

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS