Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

నేడు వామపక్ష నేతలతో కలిసి లగచర్ల పర్యటన,*   *భాధిత రైతులకు అండగా నిలుస్తాము,*   *విదేశీ సంస్థలకు భూములప్పగించేందుకే ఫార్మా కంపెనీల ఏర్పాటు,*   *కేసీఆర్ అహంకార విధానాలనే అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి,*   *బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై పార్టీ నిరంతరం పోరాటం,*   *కలెక్టర్, అధికారులపై దాడి కరెక్ట్ కాదు….సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.*

 

సూర్యాపేట:

నవంబర్ 21న వామపక్ష నేతలతో కలిసి లగచర్లకు వెళ్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. రైతులకు అండగా నిలవడంతోపాటు బాధిత కుటుంబాలను పరామర్శిస్తామన్నారు. బుధవారం స్థానిక యం.వి.ఎన్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల లో ఫార్మాకంపెని ఏర్పాటు కోసం నిర్బంధం చేసి రైతుల నుండి భూముల సేకరణ చేయడం సరికాదని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. గురువారం నాడుసిపిఎం,సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమక్రసీ, ప్రజా పంధా, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి లగచర్లకు వెళ్లి భాధిత రైతులను పరామర్శ చేస్తామని అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి తో మాట్లాడతామని అన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఫార్మా సిటి ఏర్పాటు కోసం భూసేకరణ చేసినప్పుడు కూడ అక్కడి రైతులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. గతంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పదేళ్ల కాలంలో చట్టాలను ఉల్లంఘించి భూసేకరణ చేశారని, ఇప్పుడు కెటిఆర్ రైతుల పక్షాన మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే బిఆర్ ఎస్ కు బలం చేకూరుతుందని తెలిపారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని అన్నారు. గిరిజల తండాలకు నాయకులు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేసి, పోలీసు బందోబస్తు పెట్టి ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థ కు హానికరమని ఆయన పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయటం కరెక్ట్ కాదని దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.ప్రభుత్వ విధానాలను అధికారులు అమలు చేస్తారని, వారిపై దాడులు చేయడం మంచిపద్దతి కాదని అన్నారు. లగచర్లలో భూసేకరణ విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించలేదని విమర్శించారు. గతంలో ఫార్మా సిటీని వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు లగచర్లలో భూ సేకరణ జరపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

విదేశీ సంస్థలకు అప్పగించేందుకే ఫోర్త్‌ సిటీనా అని ఆయన విమర్శించారు.

గతంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలు సేకరించారని తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు. ఆ ఫార్మా సిటీని రద్దు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు లగచర్లలో ఫోర్త్‌సిటీ పేరుతో రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవడం తగదని పేర్కొన్నారు. విదేశీ కంపెనీల ద్వారా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పడం విదేశీ కంపెనీలకు భూములు అప్పగించడమేనని ఆరోపించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు తమ భూములను తీసుకుంటే జీవనోపాధి కోల్పోతామని ఆవేదనతో ఉన్న రైతులను నిర్బంధాలతో గ్రామాన్ని జైలుగా మార్చి ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నిర్భందాలు విధించిన వాళ్లు రాజకీయంగా ఏమయ్యారో గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. మూసి నదిలో ఫార్మా కంపెనిల నుండి వచ్చే విషపదార్థాలు కలుస్తున్నాయని, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసిలో కలవకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.హైడ్రా, మూసీ ప్రక్షాళన, దామగుండం రాడార్ స్టేషన్ ఏర్పాటు, గ్రూప్-1 వివాదం, ఫార్మాసిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమో సీఎం ఆలోచించాలన్నారు. కెసిఆర్ అహంకార పూరిత, ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేసారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజాస్వామ్య బద్దంగా వుండాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పరిపాలనా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలకు సిద్ధపడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించడం తప్ప మరే ఇతర పథకాలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. అదేవిధంగా రైతు రుణ మాఫీ విషయంలో 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 18 వేల కోట్ల రూపాయల మాఫీ మాత్రమే చేశారని పేర్కొన్నారు.కేసీఆర్ అనుసరించిన అహంకార విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

లౌకికి వాదాన్ని బలోపేతం చేయడానికి, బిజెపి అనుసరించే మతోన్మాద విధానాలపై తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.

 

*ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్, బి.ఆర్.యస్,బీజేపీ* *నేతలు….సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌, వీరయ్య….*

 

రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యలను పక్కదారి పట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బి.ఆర్.యస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కు నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విఫలం చెందారని ఆరోపించారు. రాష్ట్రనికి మణిహారం గా ఉన్న సింగరేణి బొగ్గు గనుల వేలంపాటలకు కేంద్రం సిద్ధపడుతుందని అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. లోకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎండగట్టలేక పోతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం లో మూడు,నాలుగు జిల్లాలో చోటుచేసుకున్న సమస్యలను హిందూ, ముస్లింల మధ్య జరిగిన సంఘటనలు గా చిత్రీకరిస్తూ మత విద్వేషాలకు ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ఈ విలేకరుల సమావేశంలోసిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,మట్టి పెళ్లి సైదులు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్.

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

కులగణనతో ఏ పథకం రద్దు కాదు.. సర్వేపై ప్రభుత్వం కీలక ప్రకటన..!

TNR NEWS