ఈ నెల 11 నుంచి 14 వరకు యాదాద్రి జిల్లా రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో 17 సంవత్సరాల బాలుర విభాగం లో చివ్వేమ్ల గురుకుల పాఠశాల విద్యార్థులు జి.విశాల్(10వ తరగతి) 100 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం లో నిలిచి గోల్డ్ మెడల్,200 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం పొంది సిల్వర్ మెడల్ మరియు లాంగ్ జంప్ లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం సాధించాడు.అండర్ 19విభాగం లో కే.బాబు(ఇంటర్ ద్వితీయ సంవత్సరం)200 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం,క్యారం డబుల్స్ లో దయానంద్,రాం చరణ్(ఇంటర్ ద్వితీయ సంవత్సరం)మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుపొందారు.ఈ విద్యార్థులు అందరూ హైద్రాబాదు ఎల్బీ స్టేడియం లో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనట్లు చివ్వెంల బాలుర గురుకుల పాఠశాల/కాళాశాల ప్రిన్సిపాల్ G.విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.క్రీడలలో ప్రతిభ చూపి చివ్వెంల గురుకుల పాఠశాల ను రాష్ట్రస్థాయి కి ప్రాతినిధ్యం వహించేలా చేసిన ఈ విద్యార్దులను ప్రిన్సిపాల్,svp, పీడీ, పీ ఈ టీ మరియు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు అభినందించారు.