Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.మంథని పట్టణానికి చెందిన ఏ. శంకర్ గౌడ్ మంథని గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని కే.శంకర్ గౌడ్ అనుమతి లేకుండా ఈత తాటి చెట్లను గీస్తున్నారని, ఇతనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సీఐ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సంబంధిత అధికారిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుని గీత కార్మికులు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా అబ్కారీ శాఖ అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.రామగుండం 6వ డివిజన్ కు చెందిన ఎం.లక్ష్మన్ వృద్దాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.సంతోష్ నాయక్ తనకు కార్పొరేషన్ ద్వారా టీ స్టాల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, నాయందు దయ తలిచి దానికి సంబంధించిన డబ్బులు త్వరగా వచ్చేటట్లు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారికి రాస్తూ విచారించి వెంటనే చర్యలు చేపట్టాలని అదుపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

*నవంబర్ 29,30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

TNR NEWS

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs

బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి.

TNR NEWS