December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్…

 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రైతులకు సూచించారు. బుధవారం కోదాడ పిఎసిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ కేంద్రంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు మంచిగా నడుస్తుంది అన్నారు. రైతులు పంటను తీసుకుని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టుకుని మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా 60 వేల ఎంటీ లకు పైగా ధాన్యం కొనుగోలు చేసామన్నారు. రైతులకు కూడా వారి నగదు బ్యాంకులలో నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తాసిల్దార్ ,ఎంపీడీవో మండల వ్యవసాయ అధికారిని, పోలీసులు, ఐకెపి సెంటర్ ఉంటే ఏపీఎం, లేక పిఎసిఎస్ ఉంటే వాటికి సంబంధించిన వారితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ కమిటీ సభ్యులు మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని వారికి ముందోస్తు ఆదేశాలు ఉన్నాయి అన్నారు. జిల్లాలో కూడా సంబంధించిన అధికారులతో డైలీ వీడియో కాన్ఫరెన్స్ గాని, టెలి కాన్ఫరెన్స్ గాని తీసుకుని ఆ మండలంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగే విధంగా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూన్నామన్నారు. కొంతమంది రైతులు తొందరపడి ముందుగానే కోతలు కోస్తున్నారని చేస్తున్నారని అన్నారు. పంట సజావుగా కోతకు వచ్చినప్పుడే కోయాలని సూచించారు. ముందుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం సరిపోడం లేదని ఎక్కడ ఆరబోసుకోవాలో అర్థం కాని పరిస్థితి అనీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కరిస్తామని మరికొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం పిఎసిఎస్ సిబ్బందిని టక్ షీట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిమిర్యల పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగా మండల పరిధిలోని అల్వాల్ పురం గ్రామంలో ఉన్న వెంచర్ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రఘుపతి, ఏఓ రజని, సిఈఓ లు కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS