Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నవంబర్ 23న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం చేయండి… చింత వినయ్ బాబు జిల్లా కోఆర్డినేటర్,ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

 

ఈనెల 23న ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలోని మాదిగల ఆత్మీయ సమ్మేళనం సభ జరగబోతున్నందున ఈ మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయవల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద మాదిగ జాతి మీద ఉన్నదని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించ వలసిన విషయమని అన్నారు. ఉమ్మడినల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ప్రొఫెసర్ కాసిం,ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ నెంబర్ సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు మేధావులు కవులు గాయకులు కళాకారులు వస్తున్నందువలన వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ అన్ని అనుబంధ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జ్ ములకలపల్లి రవి మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు చింత సతీష్ మాదిగ, రాష్ట్ర నాయకులు కనుకుంట్ల వెంకన్న మాదిగ, బత్తుల వెంకన్న, ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకులు కోడి వెంకటయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు విజయ్ మాదిగ, సూర్యాపేట రూరల్ మండలం అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ, ఆత్మకూర్ (ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, చివ్వెంలా మండల అధ్యక్షులు సిరిపంగి నవీన్ మాదిగ, ఆత్మకూర్ (ఎస్) ఎం ఎస్ పి అధ్యక్షులు వీరమల్ల నవీన్ మాదిగ, చివ్వెంలా ఎం ఎస్ పి అధ్యక్షులు చెరుకుపల్లి కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శులు మోలుగురి రాజు మాదిగ, చెరుకుపల్లి సతీష్ మాదిగ, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీలత చౌదరి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింత మధు మాదిగ, సూర్యాపేట టౌన్ ఎం ఎస్ పి నాయకులు దైద శ్రీను మాదిగ, మండల అధికార ప్రతినిధి కాటేపెల్లి సందీప్ మాదిగ, పంతం లింగయ్య మాదిగ, మిరియాల చిన్ని మాదిగ, ఆదిముల్లా మోహన్ మాదిగ, పిడమర్తి శ్రీను మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు చింత సాంబయ్య, మిద్దె సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

TNR NEWS

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త .. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

TNR NEWS