నల్లగొండ టౌన్:
శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి చౌరస్తాలో నల్గొండ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మంచితో పాటు,కొన్ని లోపాలు ఉంటాయని, వాటిని తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా యంత్రాంగం తరఫున తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీడియా సమాజానికి పారదర్శకంగా, స్ఫూర్తితో పనిచేసి సమాజానికి మంచి చేసేందుకు కృషి చేయాలన్నారు.
మీడియా ప్రతినిధులకు సంబంధించిన సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయం తనతో పాటు, రాష్ట్రా రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టిలో ఉందని , ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత ప్రెస్ క్లబ్ భవనం వస్తుందని అన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి యు. వెంకటేశ్వర్లు, నల్గొండ ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,గౌరవాధ్యక్ష్యులు కృష్ణారెడ్డి, ట్రెజరర్ గుండాల యాదగిరి, సీనియర్ పాత్రికేయులు, పలువురు బ్యూరో రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.