Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

రైతు. కార్మిక హక్కుల పరిరక్షణకై నవంబర్ 26న జరిగేమోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయండి.

 

సూర్యాపేట:కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన నాటి నుండి రైతు. వ్యవసాయ కార్మిక. కార్మిక హక్కులను హరిస్తూ కార్పొరేట్ శక్తుల మతోన్మాద శక్తుల వారి అభివృద్ధికి పాలన కొనసాగిస్తున్నాడు అని సిఐటియూ జిల్లా కార్యదర్శినెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో నిర్వహించినసిఐటియు,తెలంగాణ రైతు సంఘం,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దుచేస్తూ పని గంటలను పెంచుతున్నారు. ప్రైవేటీకరణ ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని పెట్టుబడుదారులకు కారు చౌకగా అమ్మే వేస్తున్నారు. దాని ఫలితంగా మరింత నిరుద్యోగం పెరుగుతుందని అన్నారు.ఆర్థిక సంక్షోభం విపరీతంగా పెరుగుతున్నదని దీని మూలంగాఅధిక ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగంలోని మూడు నల్ల చట్టాలను రైతుల పోరాట ఫలితంగా రద్దు చేసినప్పటికీ రైతాంగానికి ఎలాంటి మేలు కలగటం లేదన్నారు.పురుగుల, ఎరువుల మందుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని ఆరోపించారు.ఆరుగాలం కష్టపడ్డ రైతులకు ధర లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేఅని విమర్శించారు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఉంటే రైతాంగ పంటలకు ప్రోత్సాహకాలు ఉంటే రైతు పండించిన పంటలు 50 శాతం ప్రభుత్వం పెట్టుబడిగా సహకరిస్తే ఇలాంటి ఆత్మహత్యలు ఉండవని అన్నారు.రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.మరోవైపు రెక్కల కష్టమే ఆస్తిగా చెమట చుక్కలే పెట్టుబడిగా పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఎలాంటి హక్కులు లేవు వారికి కేటాయించిన ఉపాధి హామీ పనిని రద్దు చేయాలని కుట్ర బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గత పది సంవత్సరలుగా బడ్జెట్ నుండి నిధులను తగ్గిస్తున్నారని అన్నారు.వంద రోజులు జరగవలసిన పని కేవలం 30. 40 రోజులు మాత్రమే జరుగుతున్నదని,చేసిన పనికి బిల్లులు రాక వ్యవసాయ కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఉపాధి కూలీల పనిలో అనేక కొర్రీలు పెడుతున్నారని అన్నారు.డోన్ కెమెరాలతో పని పరిశీలనని, ఆన్లైన్ పేమెంట్ అని రెండు ఫోటోలు అన్ని కూలీలను భయభ్రాంతులను పనికిరాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలని బడ్జెట్లో రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని రోజుకు 600 కూలీ వేతన ఇవ్వాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కు కొమ్ము కాస్తు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కట్టబెడుతుందని,కార్పొరేట్ శక్తులు దేశానికి ఉన్న అప్పులను రద్దు చేస్తుందని అన్నారు.ఇటీవల కాలంలో ఒక సర్వే ప్రకారం బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని అయినా ఈ పది సంవత్సరాల కాలంలో బడా పెట్టుబడిదారులు కట్టవలసిన 20 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేయటం దుర్మార్గంఅని ఈ తప్పుడు విధానాలు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని. పారిశ్రామిక రంగాన్ని పరిరక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక. రైతు సంఘం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త బస్టాండ్ నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు జరిగే మోటార్ సైకిల్ ర్యాలీలోకార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ద oడా వెంకటరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, నాయకులు బచ్చల కూర స్వరాజ్యంతదితరులు పాల్గొన్నారు.

Related posts

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

TNR NEWS

దళిత స్పీకర్ పై దాడి ప్రయత్నించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై చర్య తీసుకోవాలని…. కాంగ్రెస్ నాయకుల డిమాండ్

TNR NEWS

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

TNR NEWS

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

TNR NEWS