Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

 

కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.తదనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

Harish Hs

సరిపడా యూరియా రైతులకు పంపిణీ చేయాలి    సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

TNR NEWS

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

Harish Hs

సుధా బ్యాంక్ సేవలు అభినందనీయం………  సుధా బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే……..  ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…….

TNR NEWS

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS

యోగా జీవితంలో ఒక భాగం కావాలి

Harish Hs