Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*చేవెళ్లలో భారాసా దీక్షా దీవాస్*

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారాస రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేవెళ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో భారాస నాయకులు దీక్షా దివస్ చేపట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భారాసా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కేసీఆర్ త్యాగంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, తొలి ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు ఆయన పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారని పలువురు భారాసా నాయకులు కొనియాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ మంగలి బాల్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు అంజన్ గౌడ్, వీరాంజనేయులు‌, మాజీ వైస్ ఎంపీపీ కర్నే శివప్రసాద్, అల్లవాడ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ చారి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ ఘనీ, యువ నాయకులు తోట శేఖర్, మండల కార్యదర్శి రామ్ ప్రసాద్, పామేన మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిములు, మాజీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు దండు సత్యం, ఎల్లయ్య, మల్లేశ్, ప్రేమ్, రవీందర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Related posts

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

TNR NEWS

ఏ ఎస్ఐగా ప్రమోషన్ పొందిన అబ్దుల్ ఖయ్యాం

Harish Hs

శాంతి భద్రతల పరిరక్షణలో సూర్యాపేట జిల్లా పోలీస్ పనితీరు అమోఘం.. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…

TNR NEWS

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs