మునగాల: మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహంవద్ద ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం.ఎస్.పి. జిల్లాప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్యమాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ,లు హాజరైవారు మాట్లాడుతూ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి దృఢమైన లిఖితపూర్వకమైన, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్నిఅందించిన మహానుభావుడుడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని భారతదేశంలోనే ఎటువంటివర్గబేధాలు లేకుండా,లింగ బేధం లేకుండా అందరికీ సమాన హక్కులుకల్పించినమహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని అందరూకూడా నేటి సమాజంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కొందరివాడు కాదనిఅందరివాడిగా భారతప్రజలు స్వీకరించాల్సిన బాధ్యతఅని ప్రతి ఒక్కరిపై ఉందని వారుఈసందర్భంగాగుర్తు చేశారు.ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండలఇన్చార్జి లంజపల్లి శ్రీను మాదిగ,సామాజిక కార్యకర్త గంధం సైదులు, బీఎస్పీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మాతంగి ఏసుబాబు,మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు సిర్ర శ్రీను,మొలుగూరి వెంకటేశ్వర్లు,తాళ్లపాక వీరబాబు,సూరపల్లి శ్రీను, పడిశాల నాగరాజు,గద్దల అశోక్ మాదిగ, గద్దల వీరబాబు, వివిధ పత్రికల విలేకరులు పాల్గొన్నారు.