విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలని ఎంపీడీఓ సత్తయ్య, కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు.శనివారం కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కంగ్టి గ్రామపంచాయతీ తరపున వాలీబాల్,మరియు వాలీబాల్ నెట్ ను ఎంపీడీవో సత్తయ్య,ఎస్సై విజయ్ కుమార్ అందించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ…. విద్యార్థుల ప్రతిభను గుర్తించి క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడల గొప్పతనం గురించి చెప్పాలి అన్నారు. క్రీడల వలన మీఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్నారు. ఆటలతో విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుందాని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు క్రీడాలను కూడా ప్రోత్సహించాలని అన్నారు.విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించిన ఉన్నంత శిఖరాలకు చేరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
previous post