కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
పిట్లం ఎమ్మార్వో ఆఫీసును బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తనిఖీ చేశారు. మండలంలోని చిల్లర్గి గ్రామంలో భూ వివాదం విషయం గురించి తహశీల్దార్ వేణుగోపాల్ ను వివరణ కోరారు. అనంతరం పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. గ్రామంలో 267 సర్వే నంబర్కు చెందిన వ్యవసాయ భూమి కోర్టు కేసులో ఉండడంతో ఆ భూమిని పరిశీలించారు. కోర్టులో దరఖాస్తు చేసిన రైతుతో పాటు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నత అధికారులకు అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఆమెతో పాటు ఎంపీడీవో కమలాకర్, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.