Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో బుధవారం ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు ధన్వంతరి అని కొనియాడారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

*సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు..!!*

TNR NEWS

ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని

Harish Hs

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

Harish Hs

నేనున్నానని నిజం చేసిన వినాయకుడు చిన్నారుల వద్దకు దాతలను పంపించి అన్నదానం చేయించాడు 19 వ వార్డులో చిన్నారులకు చేయూతనిచ్చిన దాతలు… అన్నదానం విజయవంతం

TNR NEWS

పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ ఆందోల్‌లోని పలు విద్యా సంస్థల్లో పర్యటించిన మంత్రి దామోదర

TNR NEWS

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో ఉచిత వైద్య శిబిరం ఆర్ వి ఆర్ హాస్పిటల్ డాక్టర్ సాహితీ 

TNR NEWS