Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*మంథనిలో పోలీసుల కార్డెన్ సర్చ్*  సరైన ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను గుర్తించిన పోలీసులు.

 

శనివారం మంథని మండలంలోని శ్రీపాద కాలనీలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్,పెద్దపెల్లి డిసిపి డాక్టర్ చేతన ఐపీఎస్,ఎసిపి గోదావరిఖని ఎం రమేష్ ఆదేశానుసారం మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు,మంథని ఎస్సై డి రమేష్,రామగిరి ఎస్సై చంద్ర కుమార్, ముత్తారం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది .గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేయడం జరిగింది.గ్రామంలోని యువత గంజాయి,మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది.గంజాయి,మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది. గ్రామంలోని యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వివిధ గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినందున చదువుకున్న యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించడం జరిగింది.మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది.అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని,గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును అని,మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం జరిగింది కాలనీలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడిన, మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.

Related posts

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఏవో

TNR NEWS

ఘనంగా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి

Harish Hs

స్వాతంత్ర్య అమరులకు ఘన నివాళి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs