మహబూబాబాద్ జిల్లా, ఆదివారం రోజు దేశ సరిహద్దుల్లో విశ్వాసపాత్రులైన భద్రత దళ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా, వివేకనంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, చలికాలం తీవ్రతతో ఈదురు గాలులు తీవ్రంగా వీస్తున్న తరుణంలో, నిరుపేద వృద్ధులకు 50 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆరె వీరన్న, గౌరవ అధ్యక్షులు చీర బిక్షపతి, కోశాధికారి జూల్లూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దొడ్డ శ్రీనివాస్, సలహాదారులు చెల్పూరి వెంకన్న, అసోసియేషన్ సభ్యులు సమ్మయ్య, మంగీలాల్, రవి, చొక్కా రావు, వీరన్న, రాంబాబు, రవి, వీరన్న, క్రాంతి, కుమార స్వామి, రాజు, నారాయణ, సంతోష్, జగన్, నవీన్, జుంకీలాల్, నరేష్, నిమ్ములు తదితరులు పాల్గొన్నారు.