November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

పెద్దపల్లి మండలంలోని కార్యకర్తలను ప్రతీ ఒక్కరిని కలుపుకొని భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేలా చేసి గెలుపు తీరాలకు చేరుస్తానని ఆ పార్టీ పెద్దపల్లి మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన వేల్పుల రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి సంస్థాగత పర్వంలో భాగంగా నిమ్మనపల్లి గ్రామానికి చెందిన రమేష్ ను పెద్దపల్లి మండల నూతన అధ్యక్షుడిగా జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు బిజెపిలో గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ ఇన్చార్జి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న, జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, పర్వతాలు, ఆరుముల్ల పోషం, సంపత్ రావు, తంగెడ రాజేశ్వర్ రావు, బూతు అధ్యక్షులకు తదితరులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

Related posts

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

300 మంది పిల్లలకు పతంగులు పంపిణీ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

TNR NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

TNR NEWS

*సేవాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలి

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs