మోతే: నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా రెండవసారి మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మట్టి పెళ్లి సైదులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తారని అన్నారు. పార్టీని బలమైన విప్లవ పార్టీగా తీర్చిదిద్దటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.