సూర్యాపేట: ఎన్నికల ముందు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండారైతుల సంబరాలు అని ప్రభుత్వం ఆర్భాటంచేయడంలో అర్థం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారని, సంవత్సరకాలం అవుతున్న నేటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ నోచుకోలేదన్నారు.రైతు భరోసా ఎకరాకు 15000 చొప్పున ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదన్నారు.రైతు పండించిన అన్ని రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామనటం సిగ్గుచేటు అన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వండిఏపి ధరలను మూడుసార్లుపెంచడం మూలంగా రైతాంగంపై బస్తాకు 200 రూపాయలు భారం పడుతుందన్నారు.ప్రభుత్వం వెంటనే డి ఏ పి ఇతర ఎరువులు, పురుగుల మందులుసబ్సిడీ ధరకేఇవ్వాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.