మద్దూర్ డిసెంబర్ 03 ( TNR NEWS ): ముఖమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా మద్దూర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు.
తదనంతరం మద్దూరు మండలం మున్సిపల్ అభివృద్ధి కి ప్రత్యక నిధులు కేటాయించలని కోరారు. ఈ అంశాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేకంగా మద్దూరు మండలానికి మున్సిపల్ తో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు త్వరలోనే మొదలుపెట్టబోతునట్లు తెలిపారు.మద్దూర్ కేంద్రంలో అంగన్వాడి బిల్డింగ్, ఐబి కాంపౌండ్ వాల్, పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ కట్టుటకు బిల్ సాంక్షన్ అయినట్టు తెలిపారు. ఇంకా మండలానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు,మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, జంగం బాబు, కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి. మలికార్జున్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.