గజ్వేల్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృతి చెందాడు.. మృతుడు స్వస్థలం కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లా తొండి చౌడి గ్రామం, బతుకుదెరువు కోసం గజ్వేల్ పట్టణానికి 12 సంవత్సరాల క్రితం వచ్చాడు, మృతునికి భార్య ,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు మృతదేహాన్ని పరిశీలించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారు మాట్లాడుతూ వరజిత్ అనే చిరు వ్యాపారి గప్ చుప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. విద్యుత్ షాక్ తో మృతి చెందడం వల్ల వారి కుటుంబం చెల్లాచెదురయింది. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారికి పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ అధికారులు కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.