కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం చేతకాక ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక రోజుకో టాపిక్ డైవర్షన్ తో రాజకీయ లబ్ధి పొందుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎప్పటికప్పుడు ప్రజలకు చేస్తున్న మోసాలను అనుక్షణం ప్రతిక్షణం ప్రజలకు తెలుపుతున్న ప్రజా నాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎఫ్ఐఆర్లో బుక్ చేపించిన మీరు చేస్తున్న మోసాలను ప్రజలకు ఇచ్చిన హామీల ఆరు గ్యారెంటీ లపై అడుగడుగున ప్రశ్నిస్తూ పోరాడుతామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు నా ఫోన్ టాపింగ్ అయిందని హరీష్ రావు పై జూన్ 19నా డిజిపికు ఫిర్యాదు చేశారు. అనంతరం నిజ నిజాలు తెలుసుకొని తాను ఫిర్యాదులో నిజం లేదని భావించి నవంబర్ 22న కాంగ్రెస్ నాయకున్ని తన పిటీషన్ను ఉపసంహరించుకున్నారు. నేడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ పాత కేసులను లేవనెత్తుతున్నారని రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ప్రజల మధ్యల తిరిగిన చరిత్ర హరీష్ రావు ది అన్నారు. ప్రజా క్షేత్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టడాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసులు పెట్టి భయపెట్టియడం పిరికిపందల చర్య అని అన్నారు. ఇది రేవంత్ నిరంకుశ వైఖరునికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి నీ చెంచా గాళ్ళతో ఇలాంటి ఎన్ని తప్పుడు కేసులు పెట్టించిన హరీష్ రావు భయపడారని కోర్టు ద్వారా ఎదుర్కొంటారని అన్నారు. నీ అసమర్ధ పాలనతో ప్రజలు విసిగిపోయారని నువ్వు ముఖ్యమంత్రి కుర్చీకి సరిపోవని చిల్లర రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి అనే పదానికి మచ్చ తీసుకునే విధంగా చర్యలు ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజా క్షేత్రంలో హరీష్ రావు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే ప్రజలు ఏదో రోజు నీ గొంతును నొక్కుతారని నీకు సరైన బుద్ధి చెప్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటకు మంజూరైన వెటర్నరి కళాశాలను తిరిగి సిద్దిపేటలో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. నీ పార్టీలోనే నీ మంత్రులతో నీకు సఖ్యత లేదని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. ఎప్పుడూ నీ కుర్చీ పోతుందో అనే భయం చుట్టుకుని నీవు ప్రతిపక్ష నాయకుల పైన కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల సమస్య పైన పోరాటం చేసే ప్రశ్నించే హక్కు కల్పించారన్నారు అది మర్చిపోకు అన్నరు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కోకోకోల కంపెనీని తీసుకువచ్చారని అది అప్పుడు నిర్మాణంలో ఉందని తెలిపారు. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టుగా రెడ్డి కోకోకోలా కంపెనీని ప్రారంభించి నేనే పరిశ్రమలను తీసుకువస్తున్నానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను మరియు నోటిఫికేషన్లలో సెలెక్ట్ అయిన వారికి పత్రాల అందిస్తూ మేమే యాభై వేల ఉద్యోగులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ పూర్తి చేసే 49 వేల కోట్ల రూపాయలు అవుతాయి కానీ రేవంత్ రెడ్డి కేవలం 20వేల కోట్లు మాత్రమే మాత్రమే రుణమాఫీ చేశారు అని అన్నారు. ఇంకా 29వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండు మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, గజ్వేల్ మాజీ జెడ్పిటిసి పంగా మల్లేశం, వైస్ చైర్మన్ జక్యూద్దీన్, సర్పంచులు దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బొగ్గుల చందు, నాయకులు శ్రీనివాస్, ఉమర్ అహ్మద్, స్వామి, చారి, కటిక శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.