గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం కృష్ణాజిల్లా జంప్ రోప్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించినట్లు జంప్ రోప్ సంఘ అధ్యక్షులు నాగ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ మాట్లాడుతూ తాదాట ఆడటం వలన విద్యార్థులకు ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయని , శారీరకంగా అందరూ మానసికంగా బలంగా గాను ఉంటారని అన్నారు. ఇక్కడ ఎంపికైనా క్రీడాకారులు డిసెంబర్ 14, 15 తేదీలలో అన్నమయ్య జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, కృష్ణ ప్రియా, మీరా సాహెబ్ , గీత, విజయ్కుమార్ గోగులముడి , శ్రీలత, కవిత, రత్న శేఖర్, హనీష్ పాల్గొన్నారు.
previous post