Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) స్ఫూర్తితో నేడు పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో వియన్ 20 వవర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో వి. ఎన్. పాత్ర మరువలేనిది అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన కడదాకా కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన మహా నాయకుడు విఎన్ అన్నారు. అనేకమంది శిష్యులను తయారుచేసి వారిని నాయకత్వం లోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు వచ్చినప్పుడు మొక్కవోని ధైర్యంతో పార్టీని కంటికి రెప్పలా కాపాడిన మహా నాయకుడు విఎన్ అన్నారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం వి ఎన్ చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. నలగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా సాగర్ డ్యాం నిర్మించడం జరిగిందన్నారు. బీబీనగర్ నుండి నడికుడి వరకు రైలు మార్గం నడపాలని జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఏడు దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు వి ఎన్ అన్నారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిడా రంబర జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. పదవుల కోసం ఏనాడు పాపులాడకుండా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో విఎన్ విశేష కృషి చేశారని అన్నారు. నేటికీ నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు నాయకులుగా ఉన్న వారంతా విఎన్ శిష్యులేనని అన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా, పనిచేశారని రాష్ట్రంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది ప్రజలను కదిలించి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన గొప్ప పోరాట యోధుడు విఎన్ అన్నారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా చాలాకాలం పని చేశారని ఆయన ఆశయాన్ని నేటి యువత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, దండ వెంకట్ రెడ్డి, ఎల్గూరి గోవింద్, మేకన బోయిన శేఖర్ ,ధనియాకుల శ్రీకాంత్, జిల్లపల్లి నరసింహారావు, మద్దెల జ్యోతి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 2 టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్& ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Harish Hs

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..

TNR NEWS

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి

TNR NEWS