సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేసిన సెమినార్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయి అన్నారు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పని ప్రదేశాలలో ఫిర్యాదుల బాక్సులు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన నేటికీ ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఉపాధ్యాయురాలు కవిత, ఐద్వా జిల్లా కోశాధికారి మేకన బోయిన సైదమ్మ, ఐద్వా జిల్లా నాయకురాలు పిండిగా నాగమణి, ఆవు దొడ్డి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.