డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోదాడ నియోజకవర్గం అధ్యక్షుడు పడిశాల రఘు అధ్యక్షతన కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘనంగా అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణ ఎస్ఐ రంజిత్ రెడ్డి, కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారు అన్నారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు అలాగే ప్రజల పక్షాన పత్రికల్లో స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కును సైతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి గాంధీ, పూర్ణచంద్రరావు,గంధం వెంకట్, శ్రీకాంత్ నాగరాజు, గోపాలకృష్ణ, చీమ చంద్ర శేఖర్, సత్యరాజు, గోపి, సురేష్, బుచ్చిరాములు, నజీరులు, శ్రీహరి, నరేష్, సైదులు, రవి, శ్రీకాంత్, శివ, పవన్, వీరబాబు.. తదితరులు పాల్గొన్నారు