మోతె :సిపిఎం సూర్యాపేట జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఈ నెల 29వ తేదీన సూర్యాపేట గాంధీ పార్కులో జరుగు బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. మంగళవారం మోతే మండల పరిధిలోని బుర్కా చర్ల, విబలాపురం గ్రామాలలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ. కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు లేకుంటే పాలకవర్గాలు భూస్వాముల కార్పొరేట్ల బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాల అవలంబిస్తూ ప్రజలను దోపిడీ చేస్తాయని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై భారాలను మోపుతూ అంబానీ ఆదాని లాంటి బహుళ జాతి సంస్థలకు, వేలాది కోట్లు ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఉపసంహరించుకోవాలని మోడీ అండతో ఆదాని డొల్ల కంపెనీల బాగోతం అవినీతి చరిత్ర మరొకసారి బయటపడిందని ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని. రైతు రుణమాఫీ రైతు భరోసా వెంటనే అమలు చేసి, ఐకెపి కేంద్రాల్లో దాన్యాలని కొనుగోలు చేసి రైతుల ఖాతాలో సకాలంలో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. రైతులకు 500 రూపాయల బోనస్ అన్ని రకాల ధాన్యాలకు ఇవ్వాలని కోరినారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పోరాటాలని రూపొందించడానికి సూర్యాపేట జిల్లా సిపిఎం మహాసభలు వేదిక కానున్నాయని అందులో భాగంగా ఈ నెల 29న సూర్యాపేట గాంధీ పార్కులో జరుగు బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనికోరారు.సిపిఎం మండల కార్యదర్శిములుకూరి గోపాల్ రెడ్డి,మండల కమిటీ సభ్యులుకక్కిరేణి సత్యనారాయణ,చర్లపల్లి మల్లయ్య,కొండ రాములు,గుగులోతు కృష్ణ,సిపిఎం సీనియర్ నాయకులు మక్కా అచ్చయ్య,మహిళా శాఖ కార్యదర్శి రెడ్డిమల్ల ఇందిర,దామర్ల మాణిక్కమ్మ, ములుకూరి మణెమ్మ,ధరావత్ రామ్మూర్తి, ధరావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.