మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా యశశ్విని రెడ్డి మాట్లాడుతూ .. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారాతకు కట్టుబడి ఉందన్నారు.మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడానికి మహిళా శక్తి క్యాంటీన్లు దోహదపడతాయని తెలిపారు.అదేవిధంగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి తోడ్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
previous post
next post