Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు

దౌల్తాబాద్: రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తే అదిక లాభాలు పొందవచ్చని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం  రామారం గ్రామ పరిధిలోని ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగు లాభాలు, సాగు మేలుకువల గురించి రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. ఆయిల్ ఫామ్ పంటకు నీరు ఎప్పుడు ఇవ్వాలి,సమయానికి ఎరువులు వెయ్యాలని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95 శాతం ఉంది అన్నారు. మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో ఉన్నాయి.అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు మొత్తం రూ.42 వేలు రైతుకు ప్రోత్సాహకంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ కు టన్నుకు రూ.19 వేలు ఉందని సరాసరిగా ఆయిల్ ఫామ్ 10-15 టన్నుల దిగుబడి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర పై దాడి చేయడం అమానుషం కలెక్టర్ పై దాడి ప్రజాస్వామ్యంపై దడే ప్రతీక్ జైన్ కు కేసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TNR NEWS

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TNR NEWS

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS

దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది

Harish Hs

జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం………  చదరంగంతో పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది…….  శాస్త్రీయ సైన్స్ విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం……….  జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు……

TNR NEWS

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

TNR NEWS