మున్నూరు కాపు మహిళా పరస్పర వినియోగదారుల సహకార సమితి డైరెక్టర్ గా కోదాడకు చెందిన ఆవుల విజయలక్ష్మి నియామకమయ్యారు. కాగా ఈరోజు సిద్దిపేట జిల్లా ములుగు లో జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపు మహిళలు ఆర్థికంగా బలపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆకుల లలిత, గాలి అనిల్ కుమార్, శిరంశెట్టి అన్నపూర్ణ, పూటం పురుషోత్తమరావు పటేల్, దూడి ప్రవీణ్ కుమార్, విష్ణు జగత్ ఊస రఘు తదితరులు పాల్గొన్నారు……….
previous post
next post