సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలోని హైమక్స్ లైట్స్ గత కొన్ని రోజులుగా వెలగడం లేదని గ్రామస్తులు తెలిపారు.ఎన్నో సార్లు గ్రామపంచాయతీ అధికారి,మండల అధికారి దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైమక్స్ లైట్స్ వెలగక పోవడంతో రోడ్డు పైన చికటి కమ్ముకుంది.రోడ్డు సైడ్ ఉన్న చిరు వ్యాపారస్తులు చీకట్లో అనేక ఇబ్బందిలు ఎదురుకుటున్నారు. సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుండి పిట్లం వైపు వెళ్లే రోడ్డు మొత్తం పాడైపోయి గుంతలమైయమైయింది. లైట్ వెలగపోవడంతో చీకట్లో ఎప్పుడు ఎంజరుగుతుందో అని గ్రామస్తులు ద్విచక్ర వాహనదారులు భయందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు .రోడ్డు మొత్తం చీకటితో కమ్ముకుంది. చీకట్లో గ్రమ ప్రజలు ఇబ్బంది పడుతగున్నారు.అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు.ఉన్నత అధికారులు స్పందించి చంద్రబోస్ చౌరస్తాలో హైమాక్స్ లైట్ అమర్చి చీకట్లో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారస్తులను, గ్రామ ప్రజలకు చీకటి నుంచి విముక్తి కలిగించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
previous post