వయోవృద్ధులు నిరాధారణకు గురికాకుండా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ సంఘం కోదాడ అధ్యక్షులు గడ్డం నరసయ్య, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు లు అన్నారు. శుక్రవారం ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం జూన్ 15 ఆదివారం కావడంతో ముందుగానే పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వయో వృద్ధుల పై వేధింపులు, దాడులు అధికమవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల,బంధువుల నిరాదరణకు గురై వయో వృద్ధులు రోడ్ల పాలవుతున్నారన్నారు.ప్రభుత్వ అధికారులు వయోవృద్ధుల సమస్యలపై స్పందించి నిరాదరణకు గురి చేస్తున్న కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు.రాంబాబు, కోదాడ అధ్యక్షులు గడ్డం నర్సయ్య, విద్యాసాగర్ రావు,పోట్ట జగన్ మోహన్ రావు, వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువర ప్రసాద్, కృష్ణమూర్తి, కోటయ్య, సాంబులు, భిక్షం, రంగారావు, బాలేమియా, రమేష్, సత్యనారాయణ, జాన్ షరీఫ్, నరసింహారావు, సైదులు తదితరులు పాల్గొన్నారు……..