మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం.. అని గురుస్వామి వెళ్లి శ్రీకాంత్ చారి పిలుపునిచ్చారు. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరపేట్ గ్రామంలో సోమవారం అయ్యప్ప ఆరట్టు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా హనుమాన్ ఆలయం నుంచి శివాలయం వరకు అయ్యప్ప ఉత్సవ విగ్రహంతో అయ్యప్ప స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. శివాలయంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి వేద మంత్రోచ్ఛారణలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి శ్రీకాంత్ చారి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. సనాతన ధర్మంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే శోభాయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. హిందూ బంధువులంతా క్రమం తప్పకుండా ఆలయాలను సందర్శించాలన్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు దేవీ, దేవత మూర్తుల ఆరాధన గురించి వివరించాలని సూచించారు. సనాత ధర్మంలో సూచించిన మేరకు ప్రతి హిందువు తప్పనిసరిగా కుంకుమ ధరించాలని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచం మోజులో పడి పాఠశాల, కళాశాలకు వెళ్లే ఆడపిల్లలు గాజులు వేసుకునే సంస్కృతిని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు చిన్నతనం నుంచే గాజులు వేసుకునే సాంప్రదాయాన్ని తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. ఇతర మతస్తుల మాదిరిగా హిందువులు సైతం తమ పిల్లలు హిందూ మత గ్రంథాలు పటించేలా కృషి చేయాలన్నారు. శోభాయాత్రలో అయ్యప్ప స్వాములు వెల్ది గంగయ్య, విక్రం, మ్యాడారపు మనితేజ్ చారి, శివ, చిన్న గంగయ్య, భక్తులు పాల్గొన్నారు.