చేవెళ్ల : మండలంలోని ఆలూర్ గ్రామ పరిధిలోని దామరగిద్ద గేట్ సమీపంలో గల శ్రీనివాస కాటన్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పత్తి కొనుగోలు, పత్తి ట్రాన్స్‌పోర్ట్, బిల్లులు తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఏవో శంకర్ లాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, మార్కెట్ కమిటీ సెక్రటరీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.