వివిధ కేసుల్లో కోర్టుకు వెళుతున్న వారు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారందరి సౌకర్యం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 14 వ తేదీన కోదాడ కోర్టు వద్ద నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ లో పాల్గొని తమకు చెందిన కేసులలో రాజీ చేసుకోవాలని ఆయన కోరారు.