విశ్వ గురు వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో కామదేను 2024 అవార్డ్స్ ను వివిధ రంగాలలో సేవను అందిస్తున్న ప్రముఖులను గుర్తించి అవార్డులను అందజేస్తారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతానికి చెందిన కేజేఆర్ ఫౌండేషన్ అధినేత బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షులు ఆదివారం అవార్డును అందజేశారు. ఆనంద్ కృష్ణారెడ్డి నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సేవలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పేదల సంక్షేమం అభివృద్ధి తన ఎజెండాగా ప్రజల శ్రేయస్సు తన కర్తవ్యం గా ప్రజల కొరకు అబాద్యులకు ఆపన్న ఆస్తంగా అన్నా ఆపద అంటే నేనున్నాను మీకు అండగా అంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొత్వాల్ ఆనంద్ కృష్ణారెడ్డి కి విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ఆనంద్ కృష్ణారెడ్డికి హైదరాబాదులోని తెలంగాణ టూరిజం ప్లాజాలో “తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద” సంస్థ ప్రతినిధులు డా. సత్య వోలు రాంబాబు వ్యవస్థాపక సీఈవో విశ్వగురు వరల్డ్ రికార్డ్ కార్యక్రమ చైర్మన్ ప్రొఫెసర్ డా. సారంగపాణి, ప్రిన్సిపల్ డాక్టర్ బి.ఆర్. కే. ఆర్. ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్, అతిథులు బండి శ్రీనివాస్ రఘువీర్ చైర్మన్ ప్రైమ్ 9న్యూస్ వీరి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అవార్డు ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు అందుకున్నందుకు సంతోషంతో పాటు నాలో ఇంకా ప్రజలకు మరింత సేవ చేయాలి అనేటువంటి కోరిక పెరిగిందని వారు తెలిపారు.