కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో నేడు నిర్వహించే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మున్నూరు కాపు సోదరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్మాన కార్యక్రమంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు సోదరులు ప్రతి ఒక్కరూ సభకు విచ్చేసి విజయవంతంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్ అస్పత్ వార్ వినోద్ అరవింద్ సోపాన్ సార్ ప్రదీప్ కుమార్ గండం అరవింద్ నాగనాథ్ సాయిని అశోక్ శెట్టిపల్లి విష్ణు ఉన్నారు.
previous post